ప్రాంతీయం
బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: ఏలూరు జేసీ
17-11-2026 11:09

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: ఏలూరు జేసీ
Xpress24 Jangaredduygudem 17-11-2026
ఏలూరు జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ వ్యాపారులను హెచ్చరించారు. బీపీటీ బియ్యం కిలో రూ.66, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ రూ.76, జైశ్రీరామ్ రూ.82, ఎంటీయూ కామన్ రూ.47గా ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఆర్‌పీ ఉల్లంఘనలపై జిల్లాలో ఇప్పటికే 64 కేసులు నమోదు చేశామన్నారు. బియ్యం నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు.