xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

భూ రీసర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి

30-10-2026 09:50
భూ రీసర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి
భూ రీసర్వే పనులను వేగవంతం చేసి, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 29, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 29: భూ రీసర్వే పనులను వేగవంతం చేసి, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. గురువారం సాలూరు మండలం మామిడిపల్లి గ్రామ సచివాలయంలో జరుగుతున్న భూ రీసర్వే పనుల పురోగతిని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన సర్వే పనులు, భూ రికార్డుల నమోదు ప్రక్రియ, రైతుల నుంచి అందిన అర్జీలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూ రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలో సర్వే పనులను పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.