xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ

భూ రీసర్వేను పర్యవేక్షించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

12-11-2026 11:46
సమగ్ర భూ రీసర్వేను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భూ సర్వేను వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
xPress24, Hyderabad, November 12, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. భూ సర్వేపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలోని 141 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 708 రోవర్లకు అదనంగా వారం రోజుల్లో మరో 400 రోవర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రీసర్వేలో ప్రతిభ కనబరిచిన నల్గొండ, ఖమ్మం కలెక్టర్లను అభినందించగా, నిజామాబాద్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. అభ్యంతరాల స్వీకరణ సర్వే అనంతరం అభ్యంతరాల స్వీకరణపై రైతులకు స్పష్టతనివ్వాలని, నోటీసుల జారీ తర్వాత ప్రతి 15 రోజులకు గ్రామాల్లో చాటింపు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారుల సూచనలతో రీసర్వే ఎస్‌ఓపీలో మార్పులు చేస్తామని, రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దులు, 22ఎ భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, టవర్ల నిర్మాణం మరోవైపు, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 5 కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూములను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని దిశానిర్దేశం చేశారు. బైట్ - పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.