టెక్నాలజీ
భౌతిక శాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జెన్ కు నోబెల్ బహుమతి
07-10-2026 09:59
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌ను ఈ అత్యున్నత పురస్కారం వరించింది.
xPress24, Hyderabad, October 6,
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌ను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. అంటార్కిటికాలోని దక్షిణ ధ్రువం వద్ద నిర్మించిన ఐస్‌క్యూబ్ న్యూట్రినో పరిశోధన శాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు, విశ్వం నుంచి ఉద్భవించే అత్యంత శక్తివంతమైన అంతరిక్ష న్యూట్రినోలను ఆవిష్కరించినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది. అంతరిక్షంలో ఖగోళ ప్రక్రియల ద్వారా వెలువడే భూతకణాలు అని పిలిచే న్యూట్రినోలను గుర్తించేందుకు దట్టమైన మంచును ఉపయోగించవచ్చని ఫ్రాన్సిస్ హాల్జెన్ తొలిసారిగా ప్రపంచానికి ప్రతిపాదించారు. ఆయన రూపొందించిన నమూనా ఆధారంగా అంటార్కిటికాలోని ఒక ఘనపు కిలోమీటరు విస్తీర్ణంలో అత్యంత సునిశిత కాంతి గ్రహణ సెన్సార్లతో ఐస్‌క్యూబ్ ల్యాబ్‌ను నిర్మించారు. ఈ ప్రయోగాల ద్వారా విశ్వాంతరాళంలో జరిగే అరుదైన ఖగోళ పరిణామాలను అధ్యయనం చేయడానికి కొత్త మార్గం సుగమమైంది.