xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
తెలంగాణ

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

13-11-2026 12:56
కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు నాగేంద్రుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.
xPress24, Bhadradri-Kothagudem, November 13, ప్రకృతిని ఆరాధించడం.. ప్రకృతిలోని ప్రతి జీవరాశిని గౌరవించడం.. భారతీయ సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న గొప్ప సంప్రదాయం. సృష్టిలోని సమస్త జీవకోటిలో దైవత్వాన్ని దర్శించే మన సంస్కృతిలో నాగారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు నాగేంద్రుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ఆలయాలు, నాగుల పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకుని పాలు, పండ్లు, పుష్పాలు సమర్పిస్తూ నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టలకు పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి, పూలతో పూజలు చేశారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం భక్తులు భక్తితో ప్రార్థించారు.ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ.. పూర్వం నుంచే ప్రకృతిని పూజించడం మన సంప్రదాయమని, 'ప్రకృతిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది' అనే సదుద్దేశంతోనే ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.