xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

30-10-2026 09:49
ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 905 పాయింట్లు పెరిగి 74,151 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 22,882 వద్ద ముగిసింది.
xPress24, Mumber, October 29, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు సూచీలకు ఊతమిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 900 పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ 22,900 మార్కు సమీపంలో నిలిచింది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులోనే దాదాపు రూ.5,00,000 కోట్లు పెరిగి రూ.4,77,00,000 కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్ వివరాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం 73,268.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,246.03) స్వల్ప లాభంతో ప్రారంభమై రోజంతా లాభాల్లోనే పయనించింది. ఇంట్రాడేలో 74,166.16 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరకు 905.01 పాయింట్ల లాభంతో 74,151.04 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 184.05 పాయింట్ల లాభంతో 22,882.90 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.25గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. సూచీల ర్యాలీకి కారణాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా 3.9 శాతం వద్దే ఉంచడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. భవిష్యత్తులో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG), సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) తగ్గింపు ఉండొచ్చనే అంచనాలు కొనుగోళ్లకు తోడ్పడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోలుదారులుగా మారి బుధవారం రూ.872 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు. 10 ఏళ్ల అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 5 శాతం దిగువకు చేరడం, ఇటీవల దిద్దుబాటు తర్వాత షేర్ల విలువలు అనుకూలంగా మారడం మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.