xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ

27-11-2026 14:05
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ చైతన్య ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరస్తా నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది.
xPress24, rajanna siricilla, November 27, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ చైతన్య ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరస్తా నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ....1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజని గుర్తుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగానే దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం లభించాయని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలను అణచివేశారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాకుండా, అందులోని విలువలను ఆచరణలో పాటించడమే నిజమైన గౌరవమని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంబేద్కర్ జీవితంతో ముడిపడిన ఐదు ప్రముఖ ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ఆయన చూపిన సమానత్వం, విద్య, సాధికారత మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైట్: రెడ్డబోయిన గోపి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.