xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
తెలంగాణ

భారత్ సమ్మిట్

13-11-2026 10:19
భారత్ సమ్మిట్
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారత్ సమ్మిట్' శుక్రవారం ప్రారంభం కానుంది. ‘ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 50కి పైగా దేశాల నుంచి విధాన రూపకర్తలు, మేధావులు, వ్యాపార ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు హాజరుకానున్నారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతియుత సహజీవనం, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ విదేశాంగ విధానంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆఫ్రో-ఆసియా సంఘీభావం, అలీన ఉద్యమ వారసత్వం, గ్లోబల్ సౌత్-గ్లోబల్ నార్త్ సంబంధాలపైన ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.. వాతావరణ మార్పులు, యువత-రాజకీయాలు, లింగ సమానత్వం, మీడియా భవిష్యత్తు, ప్రపంచ శాంతి వంటి అంశాలను చర్చించనున్నారు. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు.
xPress24, Hyderabad, November 13, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని  ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారత్ సమ్మిట్'  శుక్రవారం ప్రారంభం కానుంది. ‘ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ అనే ఇతివృత్తంతో  రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 50కి పైగా దేశాల నుంచి విధాన రూపకర్తలు, మేధావులు, వ్యాపార ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు హాజరుకానున్నారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతియుత సహజీవనం, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ విదేశాంగ విధానంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆఫ్రో-ఆసియా సంఘీభావం, అలీన ఉద్యమ వారసత్వం, గ్లోబల్ సౌత్-గ్లోబల్ నార్త్ సంబంధాలపైన ఈ సదస్సులో  చర్చలు జరగనున్నాయి.. వాతావరణ మార్పులు, యువత-రాజకీయాలు, లింగ సమానత్వం, మీడియా భవిష్యత్తు, ప్రపంచ శాంతి వంటి అంశాలను చర్చించనున్నారు.    వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.