xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
తెలంగాణ

'భారత్ సమ్మిట్'పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

13-11-2026 09:37
'భారత్ సమ్మిట్'పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్'పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యక్రమానికి ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక శక్తులకు హైదరాబాద్ వేదిక కావడం దురదృష్టకరమని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, మహిళలకు ఆర్థిక సాయం, పింఛన్లు, నిరుద్యోగ భృతి బకాయిల అమలుపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, November 12, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్' ఏ ప్రాతిపదికన జరుపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులను ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తూ, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న లక్ష్మణ రేఖను గౌరవించాలని సూచించారు. రాహుల్ గాంధీ ఆలోచనా విధానాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అసలు ఆయనకు ఉన్న విజన్ ఏమిటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భారత రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసి చూపేందుకు, ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేసేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలుపై సమాధానం చెప్పాలి ఒకవైపు ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తామని చెబుతూనే, మరోవైపు భారత్ సమ్మిట్ పేరుతో దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే శక్తులను ఒకే వేదికపైకి తెస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. జార్జ్ సోరోస్ వంటి అంతర్జాతీయ శక్తుల ఎజెండాతో ఈ సదస్సు జరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500, పెరిగిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ. 12 వేలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని, సమ్మిట్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులకు రాష్ట్ర వాస్తవ పరిస్థితులను కూడా వివరించాలని కిషన్ రెడ్డి అన్నారు. బైట్స్ జి. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.