జాతీయం
భారత్‌లో ఓట్ల ద్వారానే అధికార మార్పు: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
26-11-2026 14:25

అధికారం మార్పు కలలు కనడం మానుకోవాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. కర్ణాటకలోని కలబురగిలో బీజేపీ 'లోక్‌తంత్ర బచావో, అరాజక్త హటావో' పాదయాత్ర, సభలో పాల్గొన్నారు.
xPress24, Kalaburagi, November 26,
అధికారం మార్పు కలలు కనడం మానుకోవాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. కర్ణాటకలోని కలబురగిలో బీజేపీ 'లోక్‌తంత్ర బచావో, అరాజక్త హటావో' పాదయాత్ర, సభలో మాట్లాడారు. భారత్‌లో ఓట్ల ద్వారానే అధికార మార్పు జరుగుతుందని, అరాచకం, రక్తపాతంతో కాదన్నారు. పొరుగు దేశాల్లా ఇక్కడ అస్థిరత సృష్టించాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు. 1975 ఎమర్జెన్సీ, 1984 సిక్కులపై హింస, రాజ్యాంగ సంస్థలపై దాడి కాంగ్రెస్ చేసిన 3 పెద్ద తప్పులని విమర్శించారు. విదేశాల్లో దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ మాట్లాడుతున్నారన్నారు.
రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి