తెలంగాణ
భవిష్యత్తులో న్యాయవ్యవస్థ స్వరూపం, కేసుల స్వభావం పూర్తిగా మార్పు
23-11-2026 10:29

కృత్రిమ మేధ ప్రభావంతో భవిష్యత్తులో న్యాయవ్యవస్థ స్వరూపం, కేసుల స్వభావం పూర్తిగా మారనున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ అన్నారు. కామన్‌వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి వార్షిక అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలానికి, సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు తమను తాము సిద్ధం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ ప్రభావం న్యాయవ్యవస్థతో పాటు చట్టాలు, విధానాల్లోనూ గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయరంగం అందిపుచ్చుకోవాలని సూచించారు.
xPress24, Hyderabad, November 23,