తెలంగాణ
మక్తల్ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత.. రహదారి, వంతెన పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
10-11-2026 09:56

మహబూబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని కేశవనగర్ నుంచి దండు వరకు నిర్మిస్తున్న రహదారి - వంతెన పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. మక్తల్ పట్టణ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, November 9,