ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష
24-11-2026 12:23

గ్లోబల్ సమిట్కు వచ్చే ప్రతినిధుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో సమిట్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రతినిధులకు ప్రవేశం కల్పించాలని, విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం వరకు ప్రత్యేక లైజనింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అతిథులతో మర్యాదగా వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఫుడ్ కోర్టులు, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఎయిర్ షోను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
xPress24, Hyderabad, November 24,