xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనేబాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబం ఓటు

26-11-2026 11:58
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
xPress24, Amaravati, November 26, అమరావతి: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, కోడలు నారా బ్రాహ్మణి ఓటు వేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బాధ్యతగల ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకునే నాయకుల పనితీరుపైనే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే పాలకులను ప్రశ్నించే హక్కు ఉంటుందని చెప్పారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.