తెలంగాణ
ముచ్చింతల్‌లో వైభవంగా చిన్న జీయర్ స్వామి 'యతీంద్ర సప్తతి' వేడుకలు
11-11-2026 12:42
త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవం (యతీంద్ర సప్తతి) సందర్భంగా ముచ్చింతల్‌లో వేడుకలు అంబరాన్నంటాయి.
వేలాది మంది భక్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నేత్ర విద్యార్థులకు క్రీడా పోటీలు, గ్రంథావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.
xPress24, HYDERABAD, November 11,
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రం 'సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం' ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది. శ్రీత్రిదండి చిన్న జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న 'యతీంద్ర సప్తతి' వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, మానవ సేవయే మాధవ సేవ అనే సందేశాన్ని చాటుతూ ఈ వేడుకలు కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 'మంగళ తరంగిణి-2026' కార్యక్రమం అత్యంతంగా ఆకట్టుకుంది. ఇందులో భాగంగా నేత్ర విద్యాలయం (బ్లైండ్ స్కూల్) విద్యార్థులకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచ శాంతి, లోక కల్యాణం, దేశ సుభిక్షం కాంక్షిస్తూ వేలాది మంది భక్తులు ఒకే వేదికపై సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా చేపట్టిన ఈ మహాపారాయణంలో భక్తులు భక్తిభావంతో పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వం చెందారు. ఈ వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ జరిగింది. అలాగే సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా జానపద కళాబృందాల సమ్మేళనం అలరించింది.
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం ఇస్తూ.. ఆధ్యాత్మిక చింతనతో పాటు తోటి మనుషుల పట్ల ప్రేమ, సేవ గుణం కలిగి ఉండాలని ఉద్బోధించారు. సనాతన ధర్మం అందించిన వేద విజ్ఞానాన్ని, ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలను నేటి యువతకు, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిస్వార్థంగా కొనసాగించాలని, వేద విజ్ఞానం, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి.