xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
తెలంగాణ

మంచిర్యాల జిల్లాలో 11 మండలాల్లో కరువు పరిస్థితులు

29-10-2026 12:16
మంచిర్యాల జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో 11 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ధాన్యం సేకరణకు 289 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
xPress24, Mancherial, October 29, మంచిర్యాల జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు, తక్కువ వర్షపాతం నమోదైన మండలాలపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభావం పడిన 11 మండలాలను మధ్యస్థంగా (మోడరేట్) గుర్తించినట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) సురేఖ తెలిపారు. తక్కువ వర్షపాతం ప్రాతిపదికన భీమారం, చెన్నూరు, దండేపల్లి, ఆదిపూర్, జన్నారం, కోటపల్లి, మంచిర్యాల్, మందమర్రి, నస్పూర్, నిన్నెల్, వేమనపల్లి మండలాల్లో తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 289 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రస్తుతం జిల్లాలో వరి పంట కోత దశకు చేరిందని, ఈ ఖరీఫ్‌లో 1,40,000 ఎకరాలకు పైచిలుకు వరి సాగు చేసినట్లు సురేఖ వెల్లడించారు. వచ్చే నెల రెండవ వారంలో కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుల కోసం 289 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు వివరించారు. ఆరుతడి పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి నీటి ఎద్దడి పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు మళ్లీ వరి సాగు చేయవద్దని డీఏఓ కోరారు. 'ఖేతీ బచావో' నినాదంతో గ్రామపంచాయతీ స్థాయిలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వరి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. బైట్ - సురేఖ, మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి (DAO)

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.