ఆంధ్రప్రదేశ్
మెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణ
10-11-2026 15:25

నేరాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ, మెడికో-లీగల్ నివేదికల తయారీ, న్యాయస్థానాల్లో సాక్ష్యాల సమర్పణపై అవగాహన పెంపొందించేందుకు వైద్యులు, సంబంధిత అధికారులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ టి. నిశాంతి మంగళవారం పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభించారు.
xPress24, Paderu, November 10,
పాడేరు, నవంబర్ 10:
నేరాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ, మెడికో-లీగల్ నివేదికల తయారీ, న్యాయస్థానాల్లో సాక్ష్యాల సమర్పణపై అవగాహన పెంపొందించేందుకు వైద్యులు, సంబంధిత అధికారులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ టి. నిశాంతి మంగళవారం పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సంప్రదాయ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెడికో-లీగల్ విధానాలు, ఫోరెన్సిక్ డాక్యుమెంటేషన్, వైద్య-న్యాయ పరీక్షలు, పోస్టుమార్టం నివేదికల తయారీ (MedLEaPR), న్యాయస్థానాల్లో సాక్ష్యం సమర్పించే విధానాలపై ఈ శిక్షణలో అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేరాల దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించడంలో, శాస్త్రీయ ఆధారాలను సేకరించడంలో, న్యాయ ప్రక్రియలను వేగవంతం చేయడంలో వైద్య, పోలీసు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. నేర పరిశోధన, న్యాయ విచారణలో వైద్య నివేదికలు, గాయాల ధ్రువీకరణ పత్రాలు, పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో ఖచ్చితత్వం, శాస్త్రీయ విశ్లేషణ, సరైన డాక్యుమెంటేషన్, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. న్యాయవ్యవస్థకు సహకారం అందించడంలో వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి వైద్య పరీక్ష, గాయాల ధ్రువీకరణ పత్రం, పోస్టుమార్టం నివేదికను జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా రూపొందించాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా దర్యాప్తు అధికారులు నేరాలకు సంబంధించిన ఆధారాలను పద్ధతిగా సేకరించి, భద్రపరచడంతో పాటు కేసు వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. వైద్య నిపుణులతో సకాలంలో సమన్వయం చేసుకోవడం ద్వారా కేసులను మరింత పటిష్టంగా రూపొందించవచ్చని తెలిపారు.
మెడికో-లీగల్ కేసుల్లో ప్రామాణిక విధానాలను అనుసరించడం, క్రమబద్ధమైన నివేదికలు రూపొందించడం, సకాలంలో సమాచార మార్పిడి, డిజిటల్ డాక్యుమెంటేషన్‌ను మెరుగుపరచడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. MedLEaPR విధానం ద్వారా వైద్య-న్యాయ పరీక్షలు, పోస్టుమార్టం నివేదికల్లో నాణ్యత, ఏకరూపత, సమర్థత పెరుగుతాయని వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైద్య విద్యా సంచాలకుల శాఖ, సంబంధిత వైద్య అధికారుల చొరవను కలెక్టర్ అభినందించారు. నేర న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో పాల్గొనే అధికారులు సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన పొందాలని, నిపుణులతో చర్చించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని, నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేయాలని సూచించారు.
ఈ వర్క్‌షాప్ ద్వారా వైద్య నిపుణుల వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, మెడికో-లీగల్ డాక్యుమెంటేషన్‌ను మెరుగుపరచడం, శాస్త్రీయ దర్యాప్తు విధానాలను ప్రోత్సహించడం, వైద్య, పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. తద్వారా సమర్థవంతమైన దర్యాప్తుతో పాటు బాధితులకు సకాలంలో న్యాయం అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.