xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
తెలంగాణ

మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.

24-10-2026 12:59
మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం నేడు పరిశీలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ.. కుంగిన పిల్లర్లను, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రత్యక్షంగా పరిశీలించనుంది.
xPress24, Hyderabad, October 24, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ శాసనసభ్యులు ఘట్‌కేసర్ వద్ద సమావేశమై, అక్కడి నుంచి ఉమ్మడిగా మేడిగడ్డకు తరలివెళ్లారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఈ బృందంలో చేరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లతో పాటు ఏర్పడిన పగుళ్లను వీరు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బురదజల్లుతోందని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోయాయనే నెపంతో మొత్తం బ్యారేజీనే పక్కన పెట్టడం సరికాదని మండిపడ్డారు. గత వర్షాకాలంలో దిగువకు విడుదల చేసిన 750 టీఎంసీల నీటిలో.. కనీసం 250 టీఎంసీలనైనా ఎత్తిపోసి ఉంటే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో మరియు కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉండేదని నేతలు స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.