xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
తెలంగాణ

మేడిగడ్డ మరమ్మతులు చేయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: కేటీఆర్

20-11-2026 11:00
అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలోని రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించలేకపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్‌కు మంచి పేరు వస్తుందనే మేడిగడ్డను పునరుద్ధరించడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, నూతన పింఛన్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని కేటీఆర్ విమర్శించారు.
xPress24, Hyderabad, November 19, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించలేకపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే కారణంతోనే మేడిగడ్డ ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించడం లేదని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా వాటిని ఎందుకు అమలు చేయలేకపోతోందని కేటీఆర్ ప్రశ్నించారు. నూతన పింఛన్ల మంజూరు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు సాగునీరు ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. బైట్స్ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.