ఆంధ్రప్రదేశ్
మొదటిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
26-11-2026 12:10

ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. మొదటి దశలో 3 వేల 949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటిలో 707 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3 వేల 242 పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు 25 వేల 61 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ట్రేస్ యాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది..
xPress24, Amaravati, November 26,