xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
తెలంగాణ

మాదాపూర్ సున్నం చెరువు నుంచి నీటి తరలింపు వ్యవస్థలపై హైడ్రా చర్యలు

24-10-2026 14:50
మాదాపూర్ సున్నం చెరువు నుంచి నీటి తరలింపు వ్యవస్థలపై హైడ్రా చర్యలు
మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో అక్రమ నీటి దందాపై హైడ్రా యంత్రాంగం మెరుపు దాడులు చేపట్టింది. గుట్టుచప్పుడు కాకుండా బోర్లు వేసి, భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ ద్వారా ప్రమాదకర నీటిని విక్రయిస్తున్న వాటర్ మాఫియా నెట్‌వర్క్‌ను అధికారులు ధ్వంసం చేశారు.
xPress24, Hyderabad, October 24, హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో అక్రమంగా సాగుతున్న నీటి దందాపై 'హైడ్రా' అధికారులు ఉక్కుపాదం మోపారు. బస్తీ ఇళ్లలో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బోర్లు వేసి, భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన వాటర్ మాఫియాపై హైడ్రా సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ బోర్లను, రవాణాకు ఉపయోగిస్తున్న పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. సున్నం చెరువు ప్రాంతంలో అత్యంత ప్రమాదకర భార లోహాలు (Heavy Metals) ఉన్న నీటిని తోడి.. ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో వాటర్ మాఫియా చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా నెట్‌వర్క్‌ను విస్తరించి వాణిజ్య అవసరాలకు ఈ కలుషిత నీటిని సరఫరా చేస్తున్నట్లు తేలడంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ నీటి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.