xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి

02-11-2026 17:14
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
xPress24, Parvathipuram, November 2, పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 2: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ 3న పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపాలిటీల్లో జరిగే ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసు అధికారులకు భద్రతా చర్యలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సంబంధిత పోలీసు అధికారులు స్వయంగా సందర్శించి, రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రతాపరమైన లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్తింపు కార్డులను పరిశీలించి, తనిఖీలు నిర్వహించిన తర్వాత అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల ప్రవేశం, తిరిగి ప్రవేశానికి సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, కౌంటింగ్ టేబుళ్ల వద్ద పటిష్టమైన మెష్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి బాధ్యతలు, విధులపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలని, రిజర్వ్ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.