xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
జాతీయం

ముంబయి అభివ‌ృద్ధిలో తెలంగాణ కార్మికులు, వ్యాపారవేత్తలదే కీలక పాత్ర: శ్రీధర్ బాబు

19-11-2026 09:51
ముంబయి అభివ‌ృద్ధిలో తెలంగాణ కార్మికులు, వ్యాపారవేత్తలదే కీలక పాత్ర: శ్రీధర్ బాబు
ముంబయి అభివ‌ృద్ధిలో తెలంగాణ కార్మికులు, వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ముంబయిలోని వర్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026 రోడ్‌షోలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
xPress24, mumbai, November 18, ముంబయి అభివ‌ృద్ధిలో తెలంగాణ కార్మికులు, వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ముంబయిలోని వర్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026 రోడ్‌షో నిర్వహించింది. ఈ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు నేత‌ృత్వంలోని  తెలంగాణ ప్రతినిధి బృందానికి  సీఐఐ మహారాష్ట్ర రాష్ట్ర మండలి ఉపాధ్యక్షురాలు ఆర్తి కూచిభట్ల స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ శశాంక, ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈవో బి.అజిత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు ముంబయికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026లో పాల్గొనాలని ఆహ్వానించారు. మీ ప్రధాన కార్యాలయం ముంబయిలోనే ఉంచుకోండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టాలని ముంబయి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. ముంబయి నుంచి పెట్టుబడులను తరలించుకురావాలన్నది తమ ఉద్దేశం కాదని..అక్కడి సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను కొనసాగిస్తూనే తెలంగాణలో ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కార్మికులు, చేతివృత్తులవారు, వ్యాపారవేత్తలు ముంబయి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. శతాబ్దం క్రితం తెలంగాణ ప్రజలు ముంబయి అభివ‌ృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఇక్కడికి వచ్చారని.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సాంకేతిక రంగం, జీసీసీలు, డేటా సెంటర్లు, ఔషధ పరిశ్రమలు, వస్త్రాలు, దుస్తుల తయారీ, మీడియా, వినోద రంగాల్లో తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీజీ-ఐపాస్‌ విధానాన్ని వివరించారు. బైట్- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.