ఆంధ్రప్రదేశ్
మురసు తుపాను నష్టాల పై కేంద్ర బృందం పర్యటన
13-11-2026 10:07

ఆంధ్రప్రదేశ్ లోని మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కేంద్ర బృందం రెండు బృందాలుగా పర్యటించనుంది. మొదటి బృందం బాపట్ల జిల్లాలో, రెండో బృందం ఏలూరు జిల్లాలో ఈరోజు పర్యటించి తుపాను కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించనుంది. అలాగే ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
xPress24, Bapatla, November 13,