ఆంధ్రప్రదేశ్
మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
04-11-2026 17:57
మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
xPress24, Amaravati, November 4,
అమరావతి: మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు.
చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటనకు బదులుగా ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితులను సమీక్షించనున్నారు.
ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మురసు తుఫాను ప్రభావం, నష్టం, సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.