xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
ఆంధ్రప్రదేశ్

మురసు తుఫాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

02-11-2026 14:39
కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా ఉన్న మురసు తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
xPress24, Amaravati, November 2, అమరావతి, 02 నవంబర్  2026 : కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా ఉన్న మురసు తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను సన్నద్ధత, ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి క్షేత్రస్థాయిలో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు దిగువ జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నీటి ప్రవాహాలు పెరిగే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాలకు 13 నుంచి 15 టీఎంసీల వరకు నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇటీవల అర్నబ్ తుఫాను కారణంగా జరిగిన విధ్వంసం నుంచి చాలా ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే మురసు తుఫాను ప్రభావాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అర్నబ్ తుఫాను సమయంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత మురసు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తుఫాను గాలుల కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేపట్టి గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లోని చెరువులను నీటితో నింపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్ పరిధిలోని వివిధ రిజర్వాయర్లలోనూ అవసరమైన మేరకు నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటూనే వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.