xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
తెలంగాణ

ములుగు జిల్లాలో జాతీయ యువజనోత్సవం విజయవంతం: యువజన క్రీడల శాఖ అధికారి

19-11-2026 10:07
ములుగు జిల్లాలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజనోత్సవం- 2026 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
xPress24, Mulugu, November 19, యువతలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ యువజనోత్సవం- 2026 కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు ములుగు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. ధర్మానాయక్ తెలిపారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ములుగు గిరిజన భవన్ లో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ యువజనోత్సవంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. ఫోక్ డ్యాన్స్, నటకాలు, జానపద గేయాల్లో విద్యార్థులు  ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్ తో  మాట్లాడుతూ... పలు విషయాలు పంచుకున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని 2027 జనవరి 12న జరిగే జాతీయ యువజనోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని  జిల్లా స్థాయిలో యువతకు ప్రతిభా పరీక్షలు నిర్వహించినట్లు  తెలిపారు. ఇందులో భాగంగా బండారుపల్లిలోని గిరిజన భవన్‌లో 15 నుంచి 29 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. జానపద గేయం,  ఫోక్ డ్యాన్స్, పెయింటింగ్, కవిత్వం, వీధి నాటకం వంటి అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. ఈ పోటీల్లో సత్తా చాటుకున్న విద్యార్థులను డిసెంబర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు  పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన ములుగులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీసి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని చాటేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కాగా, యువతలో ప్రతిభను గుర్తించే ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అభినందించారని... యువతను ప్రోత్సహించేందుకు తమ సహకరిస్తామని హామీ ఇచ్చారని ధర్మానాయక్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులు అందజేసినట్లు ధర్మ నాయక్ తెలిపారు. బైట్ ఎ.ధర్మానాయక్,  ములుగు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.