xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జాతీయం

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం

11-11-2026 14:40
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు.
xPress24, Paderu, November 11, పాడేరు, నవంబర్ 11: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె. చిరంజీవి నాగ వెంకట సాహిత్‌లు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా, రచయితగా ఆయన జాతీయ సమైక్యత, లౌకికవాదానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం భారత విద్యావ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య ప్రతి ఒక్కరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని, పరస్పర అవగాహనతో జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలన్న ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.