ఆంధ్రప్రదేశ్
యడ్లపాడులో మురసు తుఫాన్ నష్టాలను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల
05-11-2026 09:45
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
xPress24, Yadlapadu, November 4,
పల్నాడు జిల్లా | నవంబర్ 4, 2026 :
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాన్ కారణంగా పంటలకు జరిగిన నష్టం, నీట మునిగిన ప్రాంతాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్ట వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించే అంశంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.