తెలంగాణ
యాదగిరిగుట్టలో నూతన నిత్య కల్యాణ మండపానికి భూమిపూజ
30-10-2026 17:17

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపైన నూతనంగా నిర్మించనున్న నిత్య కల్యాణ మండపానికి భూమిపూజ నిర్వహించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆలయ ఈఓ భవానీ శంకర్, తదితరుల ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
xPress24, HYDERABAD, October 30,