జాతీయం
యువ సంగీత కళాకారుల కోసం ‘AIR రైజింగ్ స్టార్స్’ కార్యక్రమం
16-11-2026 14:34

యువ సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఆల్ ఇండియా రేడియో ‘AIR రైజింగ్ స్టార్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించనుంది. మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో ఈ సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో 30 ఏళ్లలోపు యువ కళాకారులు సంగీత ప్రదర్శనలు ఇస్తారు. యువ, వర్ధమాన సంగీత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు, తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదికగా నిలవనుంది. ఆల్ ఇండియా రేడియో 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా యువ సంగీత కళాకారులను గుర్తించి, ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
xPress24, New Delhi, November 16,