xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: ఈగిల్ ఐజీ ఆకే రవికృష్ణ

30-10-2026 12:39
మాదకద్రవ్యాల దుర్వినియోగం కేవలం ఆరోగ్య, శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని, అది జాతీయ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని ఈగిల్ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.
xPress24, Vijayawada, October 30, విజయవాడ, అక్టోబర్ 30: మాదకద్రవ్యాల దుర్వినియోగం కేవలం ఆరోగ్య, శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని, అది జాతీయ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని ఈగిల్ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. వందేమాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా యువత కోసం నిర్వహిస్తున్న 'వందేమాతరం క్యాంప్ సిరీస్‌' కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజం, బలమైన దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో 'నషా ముక్త్ యువ' (మత్తుపదార్థాల రహిత యువత) అనే అంశంపై ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధమైన లేదా అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే నిర్భయంగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని ప్రోత్సహించారు. కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగిల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని ఐజీ రవికృష్ణ కోరారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.