xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలుతన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలు
తెలంగాణ

యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

07-11-2026 11:17
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లాలో యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
xPress24, SURYAPET, November 7, స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లాలో యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట IDOC మీటింగ్ హాల్ లో శుక్రవారం జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక పోటీలు జరిగాయి. జానపద నృత్యం, జానపద పాటలు, పోస్టర్ తయారీ, వీధి నాటకం, కవిత్వం వంటి అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత విద్యతో పాటు ఇతర రంగాలలో కూడా రాణించాలని, స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ డి. ప్రేమ్ రాజ్, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, మై భారత్ యూత్ ఆఫీసర్ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి మెమెంటోలు, మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. బైట్:  తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా కలెక్టర్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.