ఆంధ్రప్రదేశ్
రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్..
13-11-2026 09:58

రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘భద్రత, సాంకేతికత, వృద్ధి’ అనే అంశంపై గురువారం నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.ఓర్వకల్లులో డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ప్రకాశం జిల్లా దొనకొండలో 2 వేల ఎకరాల్లో డీఆర్‌డీఓ కేంద్రం ఏర్పాటు కానుందని వెల్లడించారు.భవిష్యత్తులో రక్షణ రంగంలో డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ భద్రత కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు.
xPress24, Visakhapatnam, November 13,