ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
26-11-2026 17:15
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మౌలిక విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు.
xPress24, Machilipatnam, November 26,
మచిలీపట్నం, నవంబర్ 26:
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మౌలిక విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం మచిలీపట్నంలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వాటి పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.