ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలి
26-11-2026 17:15
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY Bharat) ప్రకాశం జిల్లా విభాగం ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
xPress24, Ongolu, November 26,
ఒంగోలు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY Bharat) ప్రకాశం జిల్లా విభాగం ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి ఏ.వి. నరసింహ కుమార్ మాట్లాడుతూ.. యువత రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించుకుని, దేశ అభివృద్ధిలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వి. శ్రీ సాయి హరి ప్రవీణ్ (యూత్ ఐకాన్), జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ విజేత గొంటి శక్తిధర శ్రీచంద్ర, అంతర్ విశ్వవిద్యాలయాల కిక్‌బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన టి. భార్గవి (స్పోర్ట్స్ ఐకాన్లు)లను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.