ఆంధ్రప్రదేశ్
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు
02-11-2026 14:38
విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు.
xPress24, Vijayawada, November 2,
విజయవాడ, 02 నవంబర్ 2026 : విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో కన్నుమూసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. పదవీ విరమణ చేసిన రెండు నెలలకే ఆయన కన్నుమూయడం విచారకరమని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో బాలసుబ్రహ్మణ్యం కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా రవాణా శాఖ కమిషనర్గా పనిచేసిన సమయంలో ఆయన పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని సీఎం కొనియాడారు.