xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలుతన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలు
ఆంధ్రప్రదేశ్

రెండు తుపానుల ప్రభావంతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకు పైగా నష్టం

07-11-2026 10:01
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన రెండు తుపానుల కారణంగా విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
xPress24, Ongole, November 6, ప్రకాశం జిల్లా, నవంబర్ 6: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన రెండు తుపానుల కారణంగా విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో శుక్రవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే బీఎం విజయ్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడారు. వారికి భోజనం, వసతి తదితర సౌకర్యాలను మెరుగ్గా కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. గోదావరి జిల్లాల్లో గురువారం సాయంత్రానికే పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రానికి 70 శాతం పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, శనివారం సాయంత్రానికి వంద శాతం పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. విడతల వారీగా తొలుత గృహ వినియోగదారులకు, అనంతరం వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరా అందిస్తామని పేర్కొన్నారు. మురసు తుపాను కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ కండక్టర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), 7,500కు పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పొగాకు పంట కూడా భారీగా దెబ్బతిన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.