xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
తెలంగాణ

రైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్

30-10-2026 14:47
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పీఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.4,39,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎల్ నినో నష్టాల దృష్ట్యా కరువు మండలాల జాబితాను విస్తరించాలని డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, October 30, రైతును రారాజు చేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థలో నిర్వహించిన 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి జై జవాన్, జై కిసాన్ రెండు కళ్ల వంటివారని, సైనికులు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్‌ను 5 రెట్లు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.4,39,000 కోట్లను నేరుగా జమ చేశామని, తెలంగాణలో దాదాపు 30,00,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. కరువు మండలాల లెక్కింపుపై డిమాండ్ ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో రూ.20,000 కోట్ల నష్టం జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. బాధిత రైతులను ఆదుకునేందుకు కరువు మండలాల జాబితాలో మరిన్ని ప్రాంతాలను చేర్చాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానం గత కాంగ్రెస్ పాలనలో ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేదని, నేడు మోదీ విధానాలు, శాస్త్రవేత్తల పరిశోధనలతో ప్రపంచంలోనే వరి ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు. హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా ఐకార్ పరిశోధనలతో అంతర్జాతీయ ఐకాన్‌గా మారిందని అభిప్రాయపడ్డారు. బైట్ - బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.