xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలుతన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలు
ఆంధ్రప్రదేశ్

రేపు 11 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. 298 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు

07-11-2026 10:01
రేపు 11 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. 298 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 62.01 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి వెల్లడించారు.
xPress24, Paderu, November 6, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 62.01 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల పోలింగ్ వివరాలతో పాటు నవంబర్ 7వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 4,98,465 మంది ఓటర్లు ఉండగా, వారిలో 3,09,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1,54,382 మంది పురుషులు, 1,54,748 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 3,086 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. వీటిలో 2,205 మంది పురుషులు, 881 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా.. అనంతగిరి మండలంలో 65.34 శాతం, అరకువ్యాలీ మండలంలో 68.34 శాతం, చింతపల్లి మండలంలో 52.25 శాతం, డుంబ్రిగూడ మండలంలో 73.63 శాతం, జి.మాడుగుల మండలంలో 58.36 శాతం, జి.కె.వీధి మండలంలో 53.28 శాతం, హుకుంపేట మండలంలో 68.32 శాతం, కొయ్యూరు మండలంలో 61.50 శాతం, ముంచంగిపుట్టు మండలంలో 63.76 శాతం, పాడేరు మండలంలో 65.29 శాతం, పెదబయలు మండలంలో 60.48 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా డుంబ్రిగూడ మండలంలో 73.63 శాతం, అత్యల్పంగా చింతపల్లి మండలంలో 52.25 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నవంబర్ 7వ తేదీన జిల్లాలోని 11 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందుకోసం మొత్తం 298 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయగా, ఎంపీటీసీలకు 149, జెడ్పీటీసీలకు మరో 149 టేబుళ్లను కేటాయించారు. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం సుమారు 1,200 మంది సిబ్బందిని నియమించి, ఇప్పటికే శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టిన అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని, జెడ్పీటీసీ ఫలితాలను రిటర్నింగ్ అధికారి (జాయింట్ కలెక్టర్ – ఎఫ్‌ఏసీ) ప్రకటిస్తారని వివరించారు. మీడియా ప్రతినిధులకు కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల సరళి, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక మీడియా పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఓటర్లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి జిల్లా కలెక్టర్ టి. నిషాంతి కృతజ్ఞతలు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.