తెలంగాణ
రేపటి నుంచి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు
19-11-2026 09:51

రేపటి నుంచి హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా రేపటి నుంచి 4 రోజులపాటు జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. ఈ సదస్సును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని.. తెలంగాణ తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
xPress24, Hyderabad, November 18,
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా రేపటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనుండగా, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా 3,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
..పాజ్..
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ హిత రోడ్ల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలపై సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు జాతీయ రహదారులకు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026-27 బడ్జెట్‌లో రోడ్లు, వంతెనలకు 5,677 కోట్ల రూపాయలు కేటాయించామని, రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ, ఫ్యూచర్ సిటీ-మచిలీపట్నం పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. సదస్సు అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
బైట్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి