ఆంధ్రప్రదేశ్
రేపల్లె మున్సిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారం
23-11-2026 16:46

బాపట్ల జిల్లాలోని రేపల్లె పురపాలక సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫీషియో సభ్యునిగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సూచించారు.
xPress24, Repalle, November 23,