తెలంగాణ
రైలు కారిడార్ల పనులను వేగవంతం చేయాలి
31-10-2026 12:01

తెలంగాణకు ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, కొన్ని మార్పులను సూచిస్తూ తిరిగి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కీలక రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అలైన్‌మెంట్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.
xPress24, Amaravathi, October 31,