ఆంధ్రప్రదేశ్
రైళ్లలో బాణసంచా తరలించవద్దు
07-11-2026 10:24

రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో బాణసంచా, పేలుడు పదార్థాలు, ఇతర మండే స్వభావం కలిగిన వస్తువులను తీసుకెళ్లవద్దని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. దీపావళి పండుగ నేపథ్యంలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరిగే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైళ్లలో బాణసంచా, పేలుడు పదార్థాలు, ఇతర మండే వస్తువులను తీసుకెళ్లవద్దని, ధూమపానానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
xPress24, Vijayawada, November 7,