ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రజలకు చేరువకానున్న ఉత్తమ విధానాలు
12-11-2026 10:14

ఆంధ్రప్రదేశ్–సింగపూర్ భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలు రాష్ట్ర ప్రజలకు చేరువవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలులో భాగంగా అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 3వ సంయుక్త అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ ప్రభుత్వ మంత్రి గన్ సియో హువాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో నిన్నసమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల రంగాల్లో కొత్త హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల సంభవించిన తుపాను సమయంలో నాలుగు రోజుల్లోనే 30 వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించినట్లు వివరించారు.
xPress24, Amaravathi, November 12,