తెలంగాణ
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం
26-10-2026 09:29

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనుంది. 15 మంది సభ్యులతో కూడిన ఈ ప్రతినిధి బృందం ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లనుంది.
xPress24, Hyderabad, October 26,
బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనుంది. తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు ఓటరు నమోదు దరఖాస్తులను ఎప్పటికప్పుడు, ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ బృందం కోరనుంది. ఓటర్ల నమోదు విధానంలో లోపాలు, దరఖాస్తుల స్వీకరణ, పెండింగ్ వివరాలు, బీఎల్ఓల నియామకాల్లో ఉన్న లోపాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు.