ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం
27-10-2026 09:34

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పంట నష్టం నివారణకు కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతి నాలుగు గంటలకూ హెచ్చరికలు జారీ చేయాలని, వాగులు, వంకల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు.
xPress24, Amaravati, October 27,