జాతీయం
రాష్ట్రానికి 6 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
12-11-2026 10:18

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 5 నగరపాలక సంస్థలు, ఒక పురపాలక సంఘం జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ కు అరుదైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 25 శాతం అవార్డులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు.
మరోవైపు తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు సాధించడంతో ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న అవార్డు అందుకున్నారు.
xPress24, New Delhi, November 12,