తెలంగాణ
రాష్ట్రంలో 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి
18-11-2026 10:27

రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటు, పాత సంఘాల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నవంబర్ 11న వ్యవసాయ, సహకార శాఖ మెమో జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
xPress24, Hyderabad, November 18,
రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న సంఘాల పునర్వ్యవస్థీకరణకు తదుపరి చర్యలు చేపట్టేందుకు వ్యవసాయ, సహకార శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు నవంబర్ 11న ప్రభుత్వ మెమో జారీ అయింది.
నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
సహకార చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో గ్రామీణ స్థాయిలో రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీ సేవలు మరింత చేరువ కానున్నాయి.