తెలంగాణ
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత, 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్
12-11-2026 11:47
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, నవంబర్ 20 వరకు చలి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
xPress24, Hyderabad, November 12,
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 19 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. చలి తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నవంబర్ 20 వరకు మరింత పెరిగే అవకాశం
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 20వ తేదీ వరకు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చలిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.